సాయితేజ్ సినిమాలో నెగటివ్‌ పాత్రలో రమ్యకృష్ణ

27-10-2020 Tue 21:27
  • పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తున్న రమ్యకృష్ణ 
  • దేవా కట్ట దర్శకత్వంలో సాయితేజ్ సినిమా
  • కీలక పాత్రలో రమ్యకృష్ణ .. టైటిల్ 'రిపబ్లిక్'  
Ramya krishna plays a negative role in Saitej film

ప్రముఖ నటి, నిన్నటితరం కథానాయిక రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ పాత్రలను మాత్రమే పోషిస్తోంది. పాత్రలో ఏదైనా విషయం ఉంటేనే ఆమె ఒప్పుకుంటోంది. అలాగే తన స్థాయికి తగ్గా పాత్రలకే ఓకే చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో పవర్ ఫుల్ పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం. ఈ పాత్ర నెగటివ్ ఛాయలతో సాగుతుందని, హీరో పాత్రకు దీటుగా ఉంటుందనీ అంటున్నారు.

ఇక ఇందులో సాయితేజ్ సరసన నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి 'రిపబ్లిక్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమని, అందుకే సంగీత దర్శకుడిగా మణిశర్మని తీసుకున్నారని అంటున్నారు.