బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

27-10-2020 Tue 21:05
  • పోలీసుల తీరుకు నిరసనగా నిరాహారదీక్షకు దిగిన సంజయ్
  • బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • దీక్షను విరమింపజేసిన వివేక్, జితేందర్ రెడ్డి
Police lift Bandi Sanjay to hospital

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరాహార దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. పోలీసుల వైఖరికి నిరసనగా, సిద్ధిపేట సీపీని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లోని తన కార్యాలయంలో ఆయన దీక్షకు దిగారు. ఆహారం తీసుకోకపోవడంతో ఆయన శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోయాయి. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన దీక్షను విరమించారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డిలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.