కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలేకి కరోనా పాజిటివ్

27-10-2020 Tue 14:38
  • కరోనా బారినపడిన రామ్ దాస్ అథవాలే
  • ఆసుపత్రిలో చేరిక
  • నిర్ధారించిన కేంద్రమంత్రి కార్యాలయం
Union minister Ramdas Athawale tested corona positive

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే కరోనా బారినపడ్డారు. ఆయన కరోనా వైరస్ ప్రభావానికి గురైనట్టు వెల్లడైంది.  తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది.

రామ్ దాస్ అథవాలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షుడు. తాజాగా ఈ పార్టీలో నటి పాయల్ ఘోష్ చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పిన కార్యక్రమంలో రామ్ దాస్ అథవాలే పాల్గొన్నారు. అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. రామ్ దాస్ అథవాలే ప్రస్తుతం దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నిర్ధారించింది.