పాక్‌లో భారీ ఉగ్రదాడి.. ఏడుగురి మృతి.. 70 మందికి గాయాలు

27-10-2020 Tue 11:48
  • పాకిస్థాన్‌లోని పెషావర్‌, దిర్ కాలనీలో ఘటన
  • మృతుల్లో నలుగురు విద్యార్థులు
  • ఆసుపత్రులకు తరలిస్తున్న సిబ్బంది
At least 7 killed 70 injured in blast at seminary in Peshawar

పాకిస్థాన్‌లోని పెషావర్‌, దిర్ కాలనీలోని ఓ మదర్సాలో ఈ రోజు ఉదయం భారీ ఉగ్రదాడి జరిగింది. ఇందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 70 మందికి గాయాలయ్యాయని పాక్ మీడియా తెలిపింది. మృతుల్లో నలుగురు 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులు ఉన్నారని వైద్యులు తెలిపారు. గాయాలపాలైన వారిలో ఇద్దరు టీచర్లు ఉన్నట్లు చెప్పారు.

మదర్సాలో ఓ సమావేశం జరుగుతోన్న సమయంలో చాలా మంది వచ్చారని, అదే సమయంలో ఓ పేలుడు సంభవించిందని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు పేలుడు కోసం ఐఈడీ వాడారని ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు చెప్పారు. ఈ ఉగ్రదాడికి బాధ్యులు ఎవరో తెలియరాలేదని వివరించారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.