ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా?: విజయశాంతి

27-10-2020 Tue 09:44
  • దుబ్బాక ఎన్నికలో సర్వ విధాలుగా అధికార దుర్వినియోగం
  • ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు
  • మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతుంది
vijaya shanti on dubbaka election

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజక వర్గంలో టీఆర్ఎస్ ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దుబ్బాక ఎన్నికలో అధికార టీఆర్ఎస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది’ అని ఆమె ఆరోపించారు.
 
‘గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా? కాదా? అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి’ అని విజయశాంతి అన్నారు.