విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసు.. నిలకడగా నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి

27-10-2020 Tue 08:49
  • నిన్న నిందితుడిని పరిశీలించిన జీజీహెచ్ సూపరింటెండెంట్
  • ఆపరేషన్ తర్వాత పరిస్థితి నిలకడగా ఉందన్న ప్రొఫెసర్ ప్రభావతి
  • వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ చేస్తామని వివరణ
divya tejaswini murder accused nagendrababu health in stable condition

దివ్యతేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు పరిస్థితి నిలకడగా ఉన్నట్టు గుంటూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు తెలిపారు. నిన్న నిందితుడిని పరిశీలించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ప్రభావతి అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 15న నాగేంద్రబాబు ఆసుపత్రిలో చేరినప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కత్తిపోట్ల కారణంగా పేగులు తెగిపోయి రక్తస్రావం కావడంతో పలు అవయవాలు దెబ్బతిన్నట్టు చెప్పారు. అయితే, ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. వైద్యుల సూచన ప్రకారం అతడిని డిశ్చార్జ్ చేస్తామని ప్రభావతి తెలిపారు.