సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

27-10-2020 Tue 07:28
  • తాజా చిత్రానికి రష్మికకు భారీ పారితోషికం 
  • పవన్ సినిమాకి త్రివిక్రమ్ డైలాగులు
  • ఓటీటీ విడుదలకు సుమంత్ సినిమా రెడీ    
Rashmika paid a bomb for her latest flick

*  టాలీవుడ్ హాట్ స్టార్ రష్మిక తాజాగా శర్వానంద్ సరసన ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' పేరిట రూపొందుతున్న ఈ చిత్రంలో నటించడానికి గాను రష్మికకు కోటి పాతిక లక్షల వరకు పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాస్తారని తెలుస్తోంది. దీనికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
*  ఏఎన్నార్ మనవడు సుమంత్  హీరోగా 'కపటధారి' పేరుతో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నందిత శ్వేత కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ చేసే అవకాశం వుంది. ఈ విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.