సిద్ధిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశాం: సీపీ జోయెల్ డేవిస్

26-10-2020 Mon 21:00
  • సిద్ధిపేటలో సోదాలపై సీపీ వివరణ
  • అంజన్ రావు నివాసంలో రూ.18 లక్షలు దొరికొందని వెల్లడి
  • అందులో రూ.5.87 లక్షలు బీజేపీ కార్యకర్తలు ఎత్తుకెళ్లారన్న సీపీ
Siddipet Police Commissioner says raids conducted in three houses

సిద్ధిపేటలో పోలీసులు సోదాలు చేయడంపై సీపీ జోయెల్ డేవిస్ వివరణ ఇచ్చారు. సురభి రాంగోపాలరావు, అంజన్ రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇళ్లలో సోదాలు చేశామని వెల్లడించారు. అంజన్ రావు నివాసంలో రూ.18 లక్షల నగదు దొరికిందని సీపీ తెలిపారు. అంజన్ రావు బంధువు జితేందర్ రావు డ్రైవర్ ద్వారా డబ్బు పంపారని వివరించారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు బయటికి తెచ్చే సమయంలో 20 మంది బీజేపీ కార్యకర్తలు రూ.5.87 లక్షలు ఎత్తుకెళ్లారని వెల్లడించారు. మిగిలిన రూ.12.80 లక్షలను సీజ్ చేశామని సీపీ పేర్కొన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పారు.