బీజేపీ నేత రఘునందన్ రావు మామ ఇంట్లో సోదాలు... రూ.18 లక్షలు స్వాధీనం!

26-10-2020 Mon 20:38
  • వేడెక్కిన దుబ్బాక ఉప ఎన్నికల వాతావరణం
  • సిద్ధిపేటలో పోలీసుల సోదాలు
  • పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్యుద్ధం
Police conducts searches in Siddipet ahead of Dubbaka By Polls

దుబ్బాక ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పోలీసులు రూ.18.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధిపేటలో సోదాల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్యుద్ధానికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. అటు, రఘునందన్ రావు ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు చేపట్టారు. సోదాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సిద్ధిపేట పయనం అయినట్టు తెలుస్తోంది.