మేం అవినీతి, అక్రమాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు: తమ్మినేని

26-10-2020 Mon 20:17
  • ఇటీవల బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రకటన
  • నామినేటెడ్ పోస్టులపై అచ్చెన్న వ్యాఖ్యలు సరికాదన్న తమ్మినేని
  • టీడీపీ హయాంలో బీసీలకు పదవులెందుకు ఇవ్వలేదని వ్యాఖ్యలు
Tammineni Sitharam slams TDP leader Atchannaidu

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. తాము అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు ఎందుకు పదవులు కేటాయించలేదని ప్రశ్నించారు.

ఏపీలో కొన్నిరోజుల కిందటే బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల జాబితా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్ల పదవులు ఎందుకు? నాలుక గీసుకోవడానికా? అని విమర్శించారు.