KXIP: ప్లేఆఫ్ ముంగిట ఆసక్తికర సమరం... కోల్ కతాపై టాస్ గెలిచిన పంజాబ్

Kings XI Punjab won the toss against Kolkata Knight Rider
  • షార్జాలో నేడు పంజాబ్ వర్సెస్ కోల్ కతా
  • బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • ఇరు జట్లకు కీలకంగా మారిన మ్యాచ్ ఫలితం
ఐపీఎల్ లో ప్లేఆఫ్ దశ సమీపిస్తోంది. ఈ క్రమంలో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. షార్జాలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే పంజాబ్ అవకాశాలు ఎంతో మెరుగవుతాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కోల్ కతా నాలుగో స్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు ఐదో స్థానంలో ఉంది.

ఇక, ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ ల్లో ఆడిన ఆటగాళ్లనే బరిలో దింపుతున్నాయి. షార్జా పిచ్ విషయానికొస్తే... ఆరంభంలో కొన్ని మ్యాచ్ లలో ఇక్కడ పరుగులు వెల్లువెత్తాయి. అయితే రాన్రాను పిచ్ మందకొడిగా మారింది. దాంతో బంతి బ్యాట్ పైకి సరిగా రాకపోవడంతో టైమింగ్ కుదరక బ్యాట్స్ మెన్ ఇబ్బందిపడుతున్నారు.
KXIP
Toss
KKR
Sharjah
IPL 2020

More Telugu News