ఏపీలో తగ్గుతున్న కరోనా ప్రభావం... కొత్తగా 1,901 పాజిటివ్ కేసులు

26-10-2020 Mon 18:23
  • గత 24 గంటల్లో 51,544 కరోనా టెస్టులు
  • అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 397 కేసులు
  • అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 18 పాజిటివ్ కేసులు
No more severity in corona cases as AP sees lowest of recent days

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,901 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 397 కేసులు, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 18 కేసులు గుర్తించారు. మొత్తమ్మీద ఎనిమిది జిల్లాల్లో రెండంకెల్లో కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో 19 మరణాలు  సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 6,606కి చేరింది. తాజాగా రాష్ట్రంలో 3,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,08,924 కాగా, 7,73,548 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,770 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.