Rana Daggubati: అత్తారింట్లో రానా పండుగ సంబరాలు

Rana Daggubati celebrates Dusshera at his in laws house
  • ఇటీవలే మిహీక బజాజ్ తో రానా వివాహం
  • దసరా సందర్భంగా అత్తారింటికి వెళ్లిన రానా
  • భార్య, అత్తమామలతో కలిసి వేడుకలు

టాలీవుడ్ నటుడు రానా దసరా సందర్భంగా అత్తవారింట పండుగ వేడుకలు చేసుకున్నాడు. ఇటీవలే కరోనా లాక్ డౌన్ సమయంలో రానా వివాహం మిహీక బజాజ్ తో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత వచ్చిన పెద్ద పండుగ కావడంతో ఈ విజయదశమికి రానా అత్తారింటికి వెళ్లాడు. అత్తమామలు, భార్యతో కలిసి ఉల్లాసంగా గడిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

రానా మొదటి నుంచి విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా తమిళం, హిందీ వంటి భాషల్లోనూ సినిమాలు చూస్తే నటప్రస్థానం కొనసాగిస్తున్నాడు. రానా ప్రస్తుతం అరణ్య, 1946, విరాటపర్వం చిత్రాల్లో నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News