విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ కు ప్రారంభోత్సవం చేసిన సూపర్ స్టార్ కృష్ణ

26-10-2020 Mon 16:33
  • హైదరాబాదులో మరో స్టూడియో ప్రారంభం
  • ప్రారంభోత్సవానికి హాజరైన సుధీర్ బాబు, ప్రియదర్శిని
  • నిరాడంబరంగా స్టూడియో ప్రారంభోత్సవం
Superstar Krishna inaugurated Vijaya Krishna Green Studios

టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాదులో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటుడు నరేశ్ తో పాటు కృష్ణ కుమార్తె ప్రియదర్శిని, అల్లుడు సుధీర్ బాబు కూడా పాల్గొన్నారు. నటుడు నరేశ్ కుటుంబానికి చెందిన ఈ స్టూడియో ప్రారంభోత్సవం కొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ కు నరేశ్ చైర్మన్ గానూ, ఆయన తనయుడు నవీన్ విజయకృష్ణ వైస్ ప్రెసిడెంట్ గానూ వ్యవహరిస్తున్నారు.