పూర్వ విద్యార్థిగా ఎంఆర్ కాలేజి ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడుతున్నా: మంత్రి బొత్స

26-10-2020 Mon 15:30
  • విజయనగరం మహారాజా కళాశాలను సందర్శించిన బొత్స
  • శతాబ్దాల చరిత్ర మసకబారిపోతోందని విచారం
  • ఇక్కడి విద్యార్థులను ప్రభుత్వ కాలేజికి తరలిస్తామని వెల్లడి
AP Minister Botsa Sathyanarayana visits Vijayanagaram Maharaja College

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం మహారాజా కళాశాలను సందర్శించారు. కాలేజి పరిస్థితి గమనించి ఆయన విచారం వ్యక్తం చేశారు. మహారాజా కళాశాల శతాబ్దాల ఘనచరిత్ర మసకబారుతోంది అని వ్యాఖ్యానించారు. ఎంఆర్ కాలేజి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజికి తరలిస్తామని చెప్పారు. ఒక పూర్వ విద్యార్థిగా ప్రస్తుత ఎంఆర్ కాలేజి పరిస్థితి చూసి ఎంతో బాధపడుతున్నానని బొత్స వెల్లడించారు. కళాశాలను ప్రైవేటు పరం చేయాలని మాన్సాస్ ట్రస్ట్ యాజమాన్యం అడిగిందని తెలిపారు.