Corona Virus: ఆశాజనకంగా కరోనాపై పోరాటం... తగ్గుతున్న మహమ్మారి ప్రభావం

  • గత నవంబరులో మొదలైన కరోనా ప్రభావం
  • ప్రపంచదేశాలపై పంజా విసిరిన కరోనా
  • ఇప్పటివరకు 4.33 కోట్ల మందికి పాజిటివ్
  • కోలుకున్న 3.19 కోట్ల మంది
World corona update

గత నవంబరులో చైనాలో మొదలైన కరోనా ప్రభావం ప్రపంచదేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పటికీ అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక సంఖ్యలో కేసులు వస్తున్నాయి. అయితే, కరోనా వైరస్ తీవ్రత మునుపటితో పోల్చితే ఏమంత ఉద్ధృతంగా లేకపోవడం ఊరట కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నా, కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4,33,06,185 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,19,04,913 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒక శాతం బాధితుల పరిస్థితి మాత్రమే విషమంగా ఉండగా, 99 శాతం మంది ఆరోగ్య స్థితి మెరుగ్గానే ఉన్నట్టు వైద్య నివేదికలు చెబుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచం మొత్తమ్మీద 11,59,093 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News