1,001 కొబ్బరికాయలను భక్తులందరికీ పంచాను: సంచయిత గజపతి

26-10-2020 Mon 13:27
  • పైడితల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించాను
  • అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉంది
  • పైడితల్లి అమ్మవారి పండుగ శుభాకాంక్షలు
sanchaita gajapati goes paiditally festival

విజయనగరం పైడితల్లి అమ్మవారికి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు ఈ రోజు ఉదయం పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. అంతకుముందు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న సంచయితకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పురోహితులు స్వాగతం పలికారు.

అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారి  మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ పైడితల్లి అమ్మవారి పండుగ శుభాకాంక్షలని చెప్పారు. అలాగే అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ శుభ సందర్భంగా 1,001 కొబ్బరికాయలను విజయనగరం కోట నుండి తీసుకువచ్చి భక్తులందరికీ పంచానని వివరించారు.