కాబోయే భర్తతో ఫొటో దిగి పోస్ట్ చేసిన హీరోయిన్ కాజల్!

26-10-2020 Mon 12:30
  • ఈ నెల 30న ముంబైలో వివాహం
  • కాజల్‌ను పెళ్లాడనున్న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ
  • వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్న జంట
kajal pic gors viral

హీరోయిన్ కాజల్ అగర్వాల్  వివాహం ఈ నెల 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ముంబైలో జరగనుంది. ఆ రోజున దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తతో ఆమె ఓ ఫొటో దిగి పోస్టు చేసింది.

‘మా నుంచి మీకు దసరా శుభాకాంక్షలు’ అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోలో వారిద్దరు చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్నారు. కాగా, ఇప్పటికే వారి ఇళ్లలో పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే కాజల్ తన చేతివేళ్లను చూపిస్తూ తన నిశ్చితార్థ ఉంగరాన్ని చూపించింది. ఇటీవల కిచ్లూ ఓ పోస్ట్‌ చేస్తూ తాము వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్నామని చెప్పాడు. పెళ్లి అనంతరం వీరిద్దరు కొత్త ఇంట్లో ఉండనున్నారు.