ఇలాంటి వ్యక్తి 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడంటే భవిష్యత్తు తరాలు నమ్మడం కష్టం: విజయసాయిరెడ్డి

26-10-2020 Mon 12:06
  • నిలదీయాల్సిన పెద్దమనిషి ‘కూల్చేస్తారా’ అని ప్రశ్నిస్తున్నాడు
  • తన బంధువులు కబ్జా చేయొచ్చు
  • కానీ, పేదలకు ఇళ్ల స్థలాలివ్వకూడదంట
  • పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతున్నారు 
vijaya sai slams chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇలాంటి వ్యక్తి 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడంటే భవిష్యత్తు తరాల వారు నమ్మడం కష్టం. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే ‘అలా వదిలేస్తారా?’ అని నిలదీయాల్సిన పెద్దమనిషి ‘కూల్చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నాడు. తన బంధువులు కబ్జా చేయొచ్చు.. కానీ, పేదలకు ఇళ్ల స్థలాలివ్వకూడదంట’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. పచ్చ పార్టీ ఫిలాసఫీ మాత్రం దీనికి భిన్నం. దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు  పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్నిరకాల మాఫియాలను ప్రోత్సహించింది. పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతోంది’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.