WHO: వ్యాక్సిన్‌ను వేసే విషయంలో ఈ పద్ధతి సరికాదు: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరిక

who on vaccine distribution
  • వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీ
  • వ్యాక్సిన్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలి
  • మొదట దేశంలో అందరికీ వేయాలని దేశాలు భావిస్తున్నాయి
  • వ్యాక్సిన్‌ నేషనలిజం వల్ల కరోనా విజృంభించే అవకాశం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ రాగానే ముందు తమ దేశ ప్రజలందరికీ అందించాలని ఏ దేశానికి ఆ దేశం ఆలోచిస్తోంది. అయితే, ఈ తీరు సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గేబ్రియేసస్ అన్నారు.

తమ దేశ ప్రజలను కరోనా బారి నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజమేనని, అయితే, వ్యాక్సిన్‌ను ఎంత సమర్థంగా వాడగలం అన్న అంశం మీదే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్‌ నేషనలిజం వల్ల కరోనా మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

అంతేగానీ, దాన్ని నియంత్రించే అవకాశం ఉండదని చెప్పారు. యూరప్‌ దేశాల్లో వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. కరోనా విజృంభణ చాలా ప్రమాదకరంగా ఉందని అన్నారు. వీటి వల్ల మళ్లీ కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందుకే వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైంది కాదని చెప్పారు.

వ్యాక్సిన్ వస్తే దాన్ని అన్ని దేశాల్లోనూ వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయని తెలిపారు.  వాక్సిన్‌ను ఇలా సమర్థంగా వాడితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలిపారు. కాగా, వ్యాక్సిన్ విషయంలో అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో ముందస్తుగా వ్యాక్సిన్‌ డోసులు కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే.
WHO
vaccine
Corona Virus
COVID19

More Telugu News