టీడీపీ నేతలను అడ్డుకోవడం సరికాదు: చంద్రబాబు ఆగ్రహం

26-10-2020 Mon 11:35
  • హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలి
  • చిత్తూరు జిల్లాకు నీరు ఇవ్వాలి
  • ఈ డిమాండ్ తో పాదయాత్ర చేస్తే అడ్డుకున్నారు
  • నేతల గృహనిర్బంధం ఎత్తివేయాలి
chandra babu slams ycp

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో టీడీపీ నేతలు చేపట్టిన మహాపాద యాత్ర నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.  హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలని, చిత్తూరు జిల్లాకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఈ పాదయాత్ర చేస్తున్నారు. వారిని అడ్డుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తమ పార్టీ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు సరికాదని ఆయన చెప్పారు. వెంటనే ఆ నేతల గృహనిర్బంధం ఎత్తివేయాలని ఆయన అన్నారు. అలాగే, కుప్పం రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించాలని, హంద్రీ-నీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.