విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర.. పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

26-10-2020 Mon 10:30
  • మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో తొలిసారి 
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు
  • కరోనా పోయి ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరిన సంచయిత
Sanchaita visits vizianagaram pyditalli ammavaru temple
విజయనగరం పైడితల్లి అమ్మవారికి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళతాళాలు, పల్లకిలో పట్టువస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న సంచయితకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంచయిత మాట్లాడుతూ.. ట్రస్టు అధ్యక్షురాలిగా తొలిసారి అమ్మవారిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.