సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

26-10-2020 Mon 07:35
  • తెలుగులో బిజీ అవుతున్న రీతూ వర్మ
  • నానికి జంటగా 'ఉప్పెన' హీరోయిన్
  • చైతూ 'థ్యాంక్యూ'లో ఇద్దరు హీరోయిన్లు    
Ritu Varma getting busy in Tollywood
*  'పెళ్లిచూపులు' ఫేమ్ రీతూ వర్మ ఇప్పుడు తెలుగులో బిజీ అవుతోంది. ఇప్పటికే నానితో 'టక్ జగదీశ్' చిత్రంతో పాటు శర్వానంద్, నాగశౌర్య సినిమాలలో నటిస్తోంది. తాజాగా రవితేజ సరసన ఒక సినిమాలోనూ, కల్యాణ్ రామ్ పక్కన మరో సినిమాలోనూ కూడా రీతూ ఎంపికైనట్టు తెలుస్తోంది.    
*  నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో సాయిపల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.
*  'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందే 'థ్యాంక్యూ' చిత్రం షూటింగ్ నిన్న దసరా రోజున హైదరాబాదులో మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమాకూరుస్తున్నాడు.