బిగ్ బాస్... దివి అవుట్, మాస్టర్ ఏడుపు, కార్తికేయ పక్కన నటిస్తానన్న సమంత... అన్నీ సర్ ప్రయిజ్ లే!

26-10-2020 Mon 06:58
  • ప్రేక్షకులు ఊహించని మలుపులు
  • నాగ్ స్థానంలో హోస్టుగా సమంత
  • ఆటలాడించి, పాటలు పాడించి రక్తికట్టించిన ఎపిసోడ్
Devi Eleminated and Biggboss Weekend episode intresting

ఈ సీజన్ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని మలుపులతో సాగుతోంది. గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ నిమిత్తం హిమాలయాల్లో ఉన్న హోస్ట్ నాగార్జున, తన స్థానంలో సమంతను హోస్ట్ గా ప్రకటించగా, ఈ ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ ను తనదైన ముద్దుముద్దు మాటలతో సామ్ రక్తికట్టించింది. ఎవరినీ వదలకుండా, అందరి తప్పొప్పులు చెబుతూ మామకు తగ్గ కోడలినని నిరూపించుకుంది.

హౌస్ లోని కంటెస్టెంట్లలతో ఆటలాడించి, పాటలు పాడించి, డ్యాన్సులు చేయించిన సమంత, ఆపై ఎలిమినేషన్ ఎపిసోడ్ ను నిర్వహించింది. ఎలిమినేషన్ లో ఉన్న ఒక్కొక్కరినీ సేఫ్ గా ప్రకటిస్తూ వచ్చి, చివరికి నోయల్, దివిలను నిలబెట్టి, దివి ఎలిమినేట్ అని చెప్పి, వీక్షకులకు షాకిచ్చింది సమంత. వాస్తవానికి ఈ వారం ప్రతి ఒక్కరూ మోనాల్ వెళ్లిపోతుందని భావించారు. సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ వ్యతిరేకత కూడా ఆమెవైపే ఉంది.

అయినా, బిగ్ బాస్ ఆమెను వదిలేసి దివిని ఎలిమినేట్ చేయడం గమనార్హం. నాలుగు వారాల క్రితం టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేసిన వేళ కూడా ఇదే తరహా విమర్శలు వచ్చాయి. ఇక గత రాత్రి దివి ఎలిమినేట్ అని చెప్పగానే, హౌస్ కంటెస్టెంట్లలో అమ్మ రాజశేఖర్ బోరున విలపించాడు. మాస్టర్ ను ఓదార్చేందుకు చాలా సమయమే పట్టింది. ఆపై అందరికీ వీడ్కోలు పలికిన దివి, హౌస్ నుంచి బయటకు వచ్చి, స్టేజ్ మీదకు వచ్చిన తరువాత, అప్పటికే స్టేజ్ పై స్పెషల్ గెస్ట్ గా ఉన్న కార్తికేయ, ఆమెకు తన పక్కన నటించే చాన్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సమంత స్వయంగా అడగడం గమనార్హం.

ఇక తన చేతిలోని బిగ్ బాంబ్ (వారం రోజులు వంట చేయాలి)ను లాస్యపై వేసింది. అందరికి వంట కష్టం కాబట్టి, ఎవరినైనా అసిస్టెంట్ గా ఎంచుకోవాలని ఆమెకు సూచించగా, అభిజిత్ కావాలని కోరుకుంది. ఇక నిన్నటి ఎలిమినేషన్ లో అందరూ మెచ్చే మరో ఆసక్తికర అంశం... షో చివర్లో వచ్చింది. "నీ మనసులోని మాటను బయటపెట్టాలి" అని సమంత హీరో కార్తికేయను కోరగా, "మీతో ఒక్క సినిమా చేయాలని ఉంది" అని చెప్పేశాడు. దానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.