డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నటి ప్రీతికా చౌహాన్

25-10-2020 Sun 21:26
  • బాలీవుడ్ ను వణికిస్తున్న డ్రగ్స్ భూతం
  • ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పలువురి పేర్లు
  • కిల్లా కోర్టులో ప్రీతికాను ప్రవేశపెట్టనున్న పోలీసులు
Actress Preetika Chauhan found red handed while buying drugs

డ్రగ్స్ భూతం బాలీవుడ్ ను వణికిస్తోంది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బుల్లితెర నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్సీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. కిల్లా కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. 'దేవో కె దేవ్ మహాదేవ్', 'సంవాదన్ ఇండియా' వంటి సీరియల్స్ లో నటించిన ప్రీతికా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రీతికాను విచారిస్తే మరిన్ని పేర్లు  వెలుగులోకి వస్తాయని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు.