ట్రంప్ కు అమెరికన్లపై ప్రేమ, అభిమానం లేదు: ఒబామా తీవ్ర విమర్శలు

25-10-2020 Sun 21:17
  • తన స్వార్థం కోసం  రెండోసారి ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు
  • ట్రంప్ చుట్టూ లాబీయింగ్ చేసే వాళ్లే ఉంటారు
  • కరోనాను కూడా కట్టడి చేయలేకపోయారు
Trump has no love or affection for Americans Obama harsh criticism

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఒక స్వార్థపరుడని ... తన వ్యక్తిగత స్వార్థం కోసమే మరోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారని విమర్శించారు. అమెరికన్లపై ఆయనకు ఎలాంటి ప్రేమ, అభిమానం లేదని అన్నారు. కేవలం తన వ్యక్తిగత లాభం, తన సంపన్న మిత్రుల కోసం మరోసారి ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారని అన్నారు. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ట్రంప్ చుట్టూ ఉండే వ్యక్తులంతా లాబీయింగ్ చేసేవారని ఒబామా ఆరోపించారు. సామాన్యులెవరూ ట్రంప్ దరిదాపుల్లో కూడా ఉండరని అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో కూడా ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కఠిన సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ట్రంప్ కు లేదని అన్నారు. డెమోక్రాట్ అభ్యర్థులు బైడెన్, కమలా హారిస్ మాత్రం అందరి కోసం పని చేస్తారని చెప్పారు.