ఎట్టకేలకు ఐపీఎల్ లో మరో విజయం సాధించిన చెన్నై

25-10-2020 Sun 20:15
  • బెంగళూరుపై విజయం సాధించిన చెన్నై
  • 145 పరుగులు చేసిన బెంగళూరు
  • 18.4 ఓవర్లలోనే విజయం సాధించిన చెన్నై
CSK wins over RCB in IPL

ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టు తన పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటూ ప్లేఆఫ్ అవకాశాలను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చెన్నై ఓ విజయాన్ని సాధించింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. చెన్నై జట్టులో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 65 (51 బంతులు), అంబటి రాయుడు 39 (27 బంతులు), డుప్లెసిస్ 25 (13 బంతులు), ధోనీ 19 పరుగులు చేశారు. గైక్వాడ్, ధోనీ ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు.