ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

25-10-2020 Sun 17:10
  • 24 గంటల్లో 2,997 కేసుల నమోదు
  • ఇప్పటి వరకు మొత్తం 6,587 మంది మృతి
  • ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 30,860
New Corona cases in AP comes below 3K

కొన్ని రోజుల క్రితం వరకు కరోనా మహమ్మారి ఏపీని వణికించింది. ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 3వేల కంటే దిగువకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,997 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 466 కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 6,587 మంది మృతి చెందారు.