ఆసుపత్రి నుంచి కపిల్ దేవ్ డిశ్చార్జ్.. ఫొటో పోస్ట్ చేసిన చేతన్ శర్మ

25-10-2020 Sun 16:38
  • ఇటీవల గుండెపోటు 
  • ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • కోలుకున్న కపిల్ దేవ్
kapil discharges from hospital

టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్‌కు ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కపిల్ కోలుకున్నారని, డిశ్చార్జ్ అయ్యారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

ఇటీవల ఆసుపత్రిలో కపిల్‌ తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను కూడా ఆయనే పోస్టు చేసిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు చేతన్‌ శర్మ తెలుపుతూ ఆయనకు యాంజియో ప్లాస్టీ సర్జరీ చేసిన డాక్టర్‌ అతుల్‌ మథుర్‌తో కలిసి దిగిన ఫొటోను చేతన్‌  ఈ రోజు పోస్ట్ చేశారు.