బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు డబుల్ కిక్... సమంతతో పాటు అఖిల్.. వీడియో ఇదిగో

25-10-2020 Sun 16:27
  • పండుగ రోజు బిగ్‌బాస్‌లో ఆడబోయే ఆట పేరు స్వయంవరం
  • ప్రకటించిన సమంత
  • తన మరిదిని గెస్ట్ గా పిలిచిన హీరోయిన్
akhil comes to bigboss house

బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు నేడు డబుల్ కిక్ అందనుంది. హీరోయిన్ సమంతతో పాటు ఆమె మరిది అఖిల్ కూడా ఇందులో కనపడనున్నాడు. మంచి ఆదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్‌లో కొత్త వ్యాఖ్యాతగా అక్కినేని వారి కోడలు సమంత కనపడనున్న విషయం తెలిసిందే.

‘ఈ రోజు నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు’ అంటూ ఇప్పటికే ఆమెకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన స్టార్ మా తాజాగా మరో ప్రోమో విడుదల చేసింది. పండుగ రోజు బిగ్‌బాస్‌లో ఆడబోయే ఆట పేరు స్వయంవరం అని ఆమె తెలిపింది. తన మరిది గెస్ట్ గా వచ్చారని తెలిపి, ఆయనను ఆమె పిలిచింది. ఇకపై సమంతనే ఈ షోలో వ్యాఖ్యాతగా కనపడుతుందా? లేక దసరా రోజు మాత్రమే హోస్ట్ గా ఉంటుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.