Preity Zinta: విజయానందంలో ప్రీతి జింతా రియాక్షన్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Priety Zinta reaction after her team wins in IPL
  • నిన్న హైదరాబాద్ తో పంజాబ్ మ్యాచ్
  • ఉత్కంఠభరిత మ్యాచ్ లో పంజాబ్ విజయం
  • గాల్లోకి ముద్దులు విసిరిన ప్రీతి జింతా
ఐపీఎల్ లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. కేవలం 126 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ జట్టు దారుణంగా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే, పంజాబ్ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. హైదరాబాద్ జట్టును కేవలం 114 పరుగులకే పరిమితం చేసి ఘన విజయాన్ని అందించారు.

తమ జట్టు విజయం సాధించిన వెంటనే అప్పటి వరకు ఎంతో టెన్షన్ గా ఉన్న జట్టు సహయజమాని, సినీ నటి ప్రీతి జింటా ఆనందంతో గంతులేసింది. గాల్లోకి ముద్దులు విసిరింది. ప్రీతి జింతా రియాక్షన్ కు చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Preity Zinta
IPL 2020
Bollywood

More Telugu News