Mahesh Babu: నేనే అమ్మవారిని అంటోన్న నయన్.. మహేశ్ విడుదల చేసిన ‘అమ్మోరు తల్లి’ ట్రైలర్ అదుర్స్!

Ammoru Thalli official Telugu trailer Nayanthara Nov 14
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ నయనతార కనకదుర్గగా నటిస్తోన్న సినిమా'అమ్మోరు తల్లి'నుంచి దసరా సందర్భంగా ఈ రోజు టీజర్ విడుదలైంది. తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు. ‘ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తోన్న తొలి సినిమా'అమ్మోరు తల్లి'ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆర్జే బాలాజీతో పాటు నయనతార నటిస్తున్నారు.

ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. ఆయనతో పాటు ఆ సినిమా బృందానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని మహేశ్ పేర్కొన్నాడు. కాగా, ఈ ట్రైలర్ లో అమ్మవారిగా నయనతార దర్శనమిస్తూ చెప్పిన డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ భక్తిరస సినిమాలో కామెడీ కూడా అధికంగానే ఉంది. అడ్డమైన నీళ్లతో తనకు అభిషేకాలు చేస్తున్నారని, అందుకే తన తల వెంట్రుకల కలర్ మారిందని నయనతార అంటోంది.
Go Back to Shorts
Mahesh Babu
nayanatara
Tollywood
trailer

More Telugu News