నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే: రాధికా ఆప్టే

25-10-2020 Sun 14:15
  • నాకు వివాహ వ్యవస్థపై నమ్మకమే లేదు
  • వీసా వస్తుందనే పెళ్లి చేసుకున్నా
  • నా భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదు
I dont have belief in marriage says Radhika Apte

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే... బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. 2012లో బ్రిటీష్ మ్యుజీషియన్ బెనెడిక్ట్ టేలర్ ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. లండన్ లో స్థిర నివాసం ఉన్నప్పటికీ... సినిమాల కోసం ఎక్కువ కాలం ఆమె ఇండియాలోనే ఉంటోంది.

మరోవైపు తన వివాహంపై ఆమె ఒక సంచలన ప్రకటన చేసింది. తనకు పెళ్లిపైన, వివాహ వ్యవస్థపైన నమ్మకమే లేదని చెప్పింది. కేవలం సులభంగా యూకే వీసా వస్తుందనే కారణంతోనే బ్రిటిషన్ ను తాను పెళ్లాడానని తెలిపింది. తన భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.