రూ.100 కోట్లతో అపార్టుమెంట్లు కొన్న హీరో హృతిక్!

25-10-2020 Sun 13:35
  • ముంబైలో విలాసంతమైన రెండు అపార్ట్‌మెంట్లు కొనుగోలు
  • వాటిల్లో ఒకటి డ్యూప్లెక్స్‌ పెంట్‌ హౌస్
  • జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఇంటి కోసం ఖర్చు
  • అపార్టుమెంట్లు రెండు కలిపి దాదాపు 38,000 చ.అ విస్తీర్ణం
Hrithik Roshan buys two apartments spread over 38000 sqft

బాలీవుడ్‌ హీరో‌ హృతిక్ రోషన్ ముంబైలో విలాసంతమైన రెండు అపార్ట్‌మెంట్లు కొన్నట్లు తెలిసింది. వాటి విలువ అంతా కలిపి దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందట. వాటిల్లో ఒకటి డ్యూప్లెక్స్‌ పెంట్‌ హౌస్ కూడా ఉంది. జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఆయన ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి వాటిని కొన్నాడు. ఈ అపార్టుమెంట్లు రెండు కలిపి దాదాపు 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

ఒకదాని టెర్రస్ 6,500 చదరపు అడుగుల వరకు ఉంటుంది. దీని పైనుంచి చూస్తే ముంబైలోని అనేక ప్రాంతాలు కనపడతాయి. వాహనాల పార్కింగ్ కోసం కూడా కావాలసినంత స్థలం ఉంటుంది.  27,534 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ ఉంటుంది. తన ఈ నివాసాలను అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్ డిజైనర్ అషీష్ షాకు హృతిక్ కాంట్రాక్టు ఇచ్చాడు. వీటిల్లో ఒక ఫుట్ బాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్‌, బిలియర్డ్స్ టేబుల్‌ కూడా ఉంటుంది.