దూకుడు పెంచిన పవన్ కల్యాణ్.. మరో కొత్త సినిమా ప్రకటన!

25-10-2020 Sun 13:25
  • ఇప్పటికే సెట్స్ పై ఉన్న 'వకీల్ సాబ్'
  • లైన్లో క్రిష్, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డిల సినిమాలు 
  • సాగర్ కె. చంద్ర డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రకటన
Pawan Kalyan announces new movie

ఎన్నికల కోసం చాలా నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం సెట్స్ పై ఉంది. దీంతో పాటు క్రిష్, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డిల దర్శకత్వాలలో సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి.

తాజాగా పవన్ చేస్తున్న మరో సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.