జగన్ నేతృత్వంలో పని చేయడానికి నేను గర్వపడుతున్నాను: వైసీపీ ఎమ్మెల్యే రోజా

25-10-2020 Sun 13:12
  • జగన్ రాజకీయంగా మహిళలకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు
  • మహిళలందరూ నిజమైన దసరా జరుపుకుంటున్నారు
  • జగన్‌ పాలనలో మహిళలకు పూర్తి రక్షణ
proud to work under jagan

వైఎస్ జగన్ నేతృత్వంలో పని చేయడానికి తాను గర్వపడుతున్నానని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. దసరా పండుగ సందర్భంగా రోజా తన నివాసంలో దుర్గాదేవి పూజ చేసి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఏపీలో రాజకీయంగా మహిళలకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. జగన్ పాలనలో మహిళలందరూ నిజమైన దసరా జరుపుకుంటున్నారని చెప్పారు.

జగన్‌ పాలనలో మహిళలకు పూర్తి రక్షణ ఉందని రోజా తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేయడానికే పనిచేస్తారని విమర్శిచారు. కాగా,  చెడుపై చేయాల్సిన పోరాటంలో ప్రతి మహిళా దుర్గాదేవిగా మారాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపిణే అని ఆమె చెప్పారు. ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానని వ్యాఖ్యానించారు.


.