మరణం కూడా విడదీయలేని ప్రేమ.. ప్రియురాలి సమాధి వద్ద ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

25-10-2020 Sun 12:43
  • భూపాలపల్లిలో విషాద ఘటన
  • కుదురుపల్లిలో అనారోగ్యంతో ప్రియురాలి మృతి
  • ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయిన ప్రియుడు మహేశ్
lover commit suicide

స్నేహంతో ఏర్పడిన వారి పరిచయం ప్రేమకు దారితీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. చివరకు మరణం కూడా వారిని విడదీయలేకపోయింది. భూపాలపల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

మహదేవ్ పూర్ మండలం కుదురుపల్లిలో కొన్ని రోజుల క్రితం మహేశ్ అనే యువకుడి ప్రియురాలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతోన్న మహేశ్ మానసికంగా కుమిలిపోయాడు. చివరకు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో దసరా పండుగ రోజే ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.