‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్ రిలీజ్.. కడుపుబ్బా నవ్వించిన వర్మ

25-10-2020 Sun 12:25
  • తాను మిస్సైన ఘటనకు సంబంధించి సినిమా
  • ఇందుకు సంబంధించిన సీన్లనే ట్రైలర్ లో చూపించిన వర్మ
  • కేసులో అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ
rgv missing trailer releses

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తోన్న ‘ఆర్జీవి మిస్సింగ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది.  తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా తీస్తున్నానంటూ వర్మ ఇప్పటికే ప్రకటించారు.  ఈ సినిమాలో తాను కనపడకుండా పోవడంతో దీనిపై విచారణ జరుగుతుందని వివరించారు. ఇందుకు సంబంధించిన సీన్లనే ట్రైలర్ లో చూపిస్తూ కడుపుబ్బా నవ్వించారు.

ఈ కేసులో అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉంటారని వర్మ చెప్పారు. ఇందులోని పాత్రలు టాలీవుడ్ స్టార్లను, రాజకీయ నేతలను పోలి ఉన్నాయి.  ‘దసరా సందర్భంగా ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదలైంది.  ఇది పీకే ఫ్యాన్స్‌కి, ఎం ఫ్యామిలీకి, మాజీ సీఎం, పప్పుకి హ్యాపీ దసరా కాదంటూ వర్మ ఇప్పటికే ట్వీట్ చేశారు. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, బీ, మాజీ సీఎం, పప్పు, కేపీ, ఆర్కే ఉంటారని తెలిపారు.