హైదరాబాద్ శివారులో ట్యాంకర్ బీభత్సం.. రోడ్డుపైనే పల్టీలు

25-10-2020 Sun 11:57
  • రోడ్డుపై పల్టీలు కొట్టిన ఆయిల్ ట్యాంకర్
  • ఇంధనం లీకవడంతో భయపడిన స్థానికులు
  • డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
Oil tanker roll over in hyderabad

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ చౌరస్తాలో ఓ ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఇతర వాహనాలను తప్పించుకుంటూ వచ్చి ఒక్కసారిగా రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. మరోవైపు, బోల్తాపడిన ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవడంతో అగ్ని ప్రమాదం భయంతో స్థానికులు ఆందోళన చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.