దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. 90 శాతానికి పెరిగిన రికవరీ రేటు

25-10-2020 Sun 11:14
  • నిన్న దేశవ్యాప్తంగా  50,129 మందికి సోకిన కరోనా
  • 78,64,811 పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
  • 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు
corona virus cases latest updates in India

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 11,40,905 మందికి కరోనా పరీక్షలు చేయగా, 50,129 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 78,64,811కు పెరిగింది. అలాగే, నిన్న ఒక్క రోజే 578 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఫలితంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి మృతి చెందినవారి సంఖ్య 1,18,534కు చేరుకుంది.

కరోనా నుంచి కోలుకున్న 62,077 మంది నిన్న డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 70,78,123కు పెరిగింది. దేశంలో ఇంకా 6,68,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారినపడి వారిలో దాదాపు 90 శాతం కోలుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 8.50 శాతం కేసులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, మరణాలు రేటు 1.51 శాతం తగ్గినట్టు వివరించింది.