తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు
- జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న 185 కేసుల నమోదు
- నిన్న రాష్ట్రవ్యాప్తంగా 978 కేసులు
- 1,307కు పెరిగిన మృతుల సంఖ్య
మహమ్మారి బారి నుంచి నిన్న 1,446 మంది కోలుకోవడంతో ఈ మొత్తం సంఖ్య 2,10,480కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 19,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, వీరిలో 16,430 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న రాత్రి 8 గంటల నాటికి 185 కేసులు నమోదయ్యాయి.