ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో కలెక్టర్లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!

25-10-2020 Sun 06:23
  • కలెక్టర్ల బదిలీలను సూచించిన ఈసీ
  • మెదక్ జిల్లాకు హన్మంతరావు నియామకం
  • సంగారెడ్డి, సిద్ధిపేటలకు కూడా కొత్త కలెక్టర్లు

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు పలువురు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ముగ్గురికి స్థానచలనం కల్పించడంతో పాటు మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మెదక్ జిల్లాకు ‌హన్మంత రావు, సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి, సిద్దిపేటకు భారతీ హోళికెరీని నూతన కలెక్టర్లుగా నియమిస్తున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో పెద్దపల్లి జిల్లా అదనపు బాధ్యతలను కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంకకు, మంచిర్యాల జిల్లా అదనపు బాధ్యతలు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ కు అప్పగిస్తున్నట్టు తెలిపింది.