చెన్నై జట్టుని రజనీకాంత్ కూడా కాపాడలేరు: సెహ్వాగ్

24-10-2020 Sat 22:06
  • వాష్ రూమ్ కి వెళ్లొచ్చేసరికి టాప్ ఆర్డర్ కూలింది
  • చెన్నై జట్టు పూర్తిగా తేలిపోయింది
  • వికెట్ పడకుంటే చాలని చెన్నై అభిమానులు కోరుకున్నారు
Even Thalaiva cant save CSK says Sehwag

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర పరాభవాలను మూటకట్టుకుంటోంది. ఈ సీజన్ లో అత్యంత దారుణంగా ఆడిన జట్టు ఇదే. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో, జట్టుపై అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు పూర్తిగా తేలిపోయిందని సెహ్వాగ్ అన్నాడు. వాష్ రూమ్ కి వెళ్లొచ్చేసరికి చెన్నై టాప్ ఆర్డర్ పెవిలియన్ కు చేరిందని చెప్పాడు. వాష్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత స్కోరు చూసి షాకయ్యానని అన్నాడు. గతంలో తమ జట్టు ఆటగాళ్లు బంతిని బాదుతుంటే చెన్నై అభిమానులు కేరింతలు కొట్టే వారని... కానీ నిన్న మాత్రం 'వికెట్ పడకుంటే చాలురా భగవంతుడా' అని కోరుకున్నారని చెప్పాడు. ఈ సారి సీఎస్కేని తలైవా (రజనీకాంత్) కూడా కాపాడలేరని అన్నాడు.