Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి బెదిరింపు మెసేజ్ పెట్టిన వ్యక్తి అరెస్ట్

Man who sent threat message to Ayyanna Patrudu arrested
  • హత్య చేస్తామని మెస్సేజ్ పెట్టిన తాతారావు
  • నిందితుడిది బుచ్చయ్యపేట కేటీ అగ్రహారం
  • గతంలో కూడా ఇలాంటి మెసేజ్ లు పెట్టిన తాతారావు
తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడి హత్యకు కుట్ర పన్నినట్టుగా మెస్సేజ్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఒక ఎస్సై పెట్టినట్టుగా అయ్యన్నకు నిందితుడు మెసేజ్ పెట్టాడు. హత్యకు సంబంధించి లావాదేవీలు కూడా జరిగాయని... మావోయిస్టులు హత్య చేసినట్టుగా చిత్రీకరిస్తామని మెస్సేజ్ లో తెలిపాడు.

ఈ అంశంపై డీజీపీకి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ పనికి పాల్పడింది బుచ్చయ్యపేట కేటీ అగ్రహారం నివాసి వియ్యపు తాతారావు అనే వ్యక్తి అని గుర్తించారు. ఆయనను అరెస్ట్ చేశారు. తాతారావు గతంలో కూడా పలువురికి ఇలాంటి బెదిరింపు మెస్సేజ్ లు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.
Ayyanna Patrudu
Threat calls
Telugudesam

More Telugu News