రాజశేఖర్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు

24-10-2020 Sat 17:45
  • రాజశేఖర్ ఐసీయూలో ఉన్నారు
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
  • చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు
Doctors releases Rajasekhars health bulletin

సినీనటుడు రాజశేఖర్ కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు శివానీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సిటీ న్యూరో సెంటర్ లో డాక్టర్ కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం తన తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలిపారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.

ఇదే సమయంలో డాక్టర్లు కూడా రాజశేఖర్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. ఓ వైద్య బృందం ఆయననే నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. తమ చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. రాజశేఖర్ భార్య జీవిత కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. ఈరోజు చేసిన కోవిడ్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశామని చెప్పారు.