వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా?: బండారు సత్యనారాయణ

24-10-2020 Sat 17:10
  • గాంధీ పేరు పెట్టుకున్న యూనివర్శిటీని కూల్చడం దారుణం
  • గీతం ఆసుపత్రి అందరికంటే ముందు కరోనా సేవలు అందించింది
  • విశాఖలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు అక్రమ కట్టడాలున్నాయి
Its our fate to have a CM who has 18 cases says Bandaru

గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చడంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ పేరును పెట్టిన గీతం విశ్యవిద్యాలయాన్ని కూల్చడం దారుణమని అన్నారు. కరోనా సమయంలో అందరికంటే కంటే ముందే సేవలందించిన ఘనత గీతం ఆసుపత్రిదని చెప్పారు. ఈ విషయం కాదని నిరూపిస్తే... వైసీపీ కార్యాలయం ముందు ఉరేసుకుంటానని సవాల్ విసిరారు. విశాఖలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు అక్రమ కట్టడాలు ఉన్నాయని... వాటిని కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా? అని ప్రశ్నించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని దుయ్యబట్టారు. 18 కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ అని అన్నారు.