పైరసీ విషయంలో అభిమానులకు బాలకృష్ణ విన్నపం

24-10-2020 Sat 16:33
  • పైరసీని ఎవరూ సమర్థించవద్దు
  • పైరసీ లింకులు దొరికితే ఫిర్యాదు చేయండి
  • 'నర్తనశాల'ను శ్రేయస్ ఈటీ ద్వారా మాత్రమే చూడండి
Dont encourage piracy says Balakrishna

పైరసీని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. తాను దర్శకత్వం వహించిన 'నర్తనశాల' చిత్రంలోని 17 నిమిషాల నిడివి గల సన్నివేశాలను ఈరోజు ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రేయస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్ లో వీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య సోషల్ మీడియా ద్వారా సినీ అభిమానులకు ఒక విన్నపం చేశారు. పైరసీని ఎవరూ సమర్థించవద్దని కోరారు. పైరసీ లింకులు దొరికితే వాటిని claims@antipiracysolutions.org కి ఫిర్యాదు చేయాలని చెప్పారు. కేవలం శ్రేయస్ ఈటీ ద్వారా మాత్రమే 'నర్తనశాల' చిత్రాన్ని చూడాలని అన్నారు. పైరసీని అడ్డుకోవడంలో ప్రతి అభిమాని ఒక సైనికుడు కావాలని చెప్పారు.