‘ఆర్జీవీ మిస్సింగ్’ నుంచి ఆసక్తి కలిగించే పోస్టర్ విడుదల.. రేపు ట్రైలర్ రిలీజ్

24-10-2020 Sat 13:06
  • రేపు 11 గంటలకు ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్
  • దసరా సందర్భంగా విడుదల అని ఆర్జీవీ ప్రకటన
  • ఇది పీకే ఫ్యాన్స్‌కి, మాజీ సీఎం, పప్పుకి హ్యాపీ దసరా కాదని వ్యాఖ్య
Trailer of RGV MISSING releasing tmrw 25 th at 11 AM

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తోన్న ‘ఆర్జీవి మిస్సింగ్’ సినిమాలోంచి మరో ఆసక్తికర పోస్టర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమానుంచి  పలు పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే.  తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా ఇదంటూ వర్మ ఇప్పటికే ప్రకటించారు. తన మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేస్తోన్న ఓ పోలీసు అధికారి ఓ సినీ స్టార్‌ను పట్టుకుని పిస్టల్ గురి పెట్టి విచారిస్తున్నట్లు కొత్త పోస్టర్‌లో ఆర్జీవీ చూపించారు.

ఈ సినిమాలో తాను కనపడకుండా పోవడంతో దీనిపై విచారణ జరుగుతుందని, ఈ కేసులో అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉంటారని వర్మ చెప్పారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఇద్దరు టాలీవుడ్ స్టార్లను పోలి నటులు ఉన్నారు. ‘దసరా సందర్భంగా రేపు 11 గంటలకు ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదల అవుతుంది. ఇది పీకే ఫ్యాన్స్‌కి, ఎం ఫ్యామిలీకి, మాజీ సీఎం, పప్పుకి హ్యాపీ దసరా కాదు’ అని వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, బీ, మాజీ సీఎం, పప్పు, కేపీ, ఆర్కే ఉంటారని ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు.