ఆసుపత్రిలో కూతురితో కలిసి కపిల్‌ దేవ్‌.. ఫొటో పోస్ట్ చేసిన చేతన్ శర్మ

24-10-2020 Sat 12:51
  • కపిల్ దేవ్‌కు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు 
  • ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • నిలకడగా కపిల్ దేవ్ ఆరోగ్యం
kapil dev pic goes viral

టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్‌కు  శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ తెలిపారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో కపిల్‌ తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ఆయన పోస్టు చేశారు. కపిల్ దేవ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సంతోషంగా ఫొటోకి పోజు ఇచ్చారు. కపిల్‌ కూడా తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ కొన్ని గంటల క్రితం ట్వీట్ చేశారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకుని, స్పందిస్తూ తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. తాను త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని చెప్పారు.