మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టిన రష్మిక!

24-10-2020 Sat 12:26
  • రెండు వరుస విజయాలతో రష్మిక
  • ఇప్పటికే అల్లు అర్జున్ తో 'పుష్ప'
  • శర్వానంద్ తో తాజాగా జోడీ
  • సినిమా పేరు 'ఆడాళ్లూ మీకు జోహార్లు'
Rashmika Mandanna gets another chance in Tollywood

ఇటీవలి కాలంలో కొత్తగా వచ్చిన హీరోయిన్లలో కన్నడ భామ రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో చాలా డిమాండులో వుంది. మహేశ్ తో 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ తో 'భీష్మ' చిత్రాలలో నటించి వరుస విజయాలు అందుకున్న రష్మికకు ప్రేక్షకులలో క్రేజ్ పెరిగింది. దాంతో చాలామంది హీరోలు కూడా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పట్ల మొగ్గుచూపుతూ, తమ సినిమాలకు రికమెండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో రష్మిక నటిస్తోంది. అలాగే, మరికొన్ని సినిమాల విషయంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా శర్వానంద్ సరసన కూడా నటించే అవకాశాన్ని ఈ చిన్నది పొందినట్టు సమాచారం.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వా హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారన్నది తాజా వార్త. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' పేరుతో రూపొందే ఈ చిత్రం షూటింగ్ రేపటి నుంచి తిరుపతి పట్టణంలో జరుగుతుంది.